Ad Code

ప్రపంచ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారత్ తిరుగులేని ఆధిక్యానికి పుతిన్ ప్రత్యేకంగా అభినందన

ష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఎకానమిక్ ఫోరం 2026 వేదికగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ భారత్‌తో రష్యాకు ఉన్న సంబంధాలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవని స్పష్టం చేశారు. ప్రపంచ ఐటీ రంగంలో భారతదేశం పోషిస్తున్న అగ్రగామి పాత్రను ప్రశంసించడంతో పాటు గ్లోబల్ ఎకానమీలో అమెరికా నేతృత్వంలోని జీ7 కూటమి కంటే బ్రిక్స్ కూటమి అత్యంత శక్తివంతంగా ఎదుగుతోందని గణాంకాలతో సహా నిరూపించారు. ప్రపంచ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారతదేశానికి ఉన్న తిరుగులేని ఆధిక్యాన్ని పుతిన్ ప్రత్యేకంగా అభినందించారు. “ఐటీ పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మా అత్యంత కీలక భాగస్వామి భారతదేశానికి నేను స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారత్ వాటా గణనీయంగా ఉంది. భారత ప్రజలు ఎంతో ప్రతిభావంతులు, ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా కోడింగ్, ఇతర సాంకేతిక రంగాలలో భారతీయుల సామర్థ్యానికి ప్రపంచవ్యాప్త ఖ్యాతి ఉంది” అని పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు.

Post a Comment

0 Comments

Close Menu