దేశాన్ని మోడీ సర్వనాశనం చేశారని, ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్ స్పందిస్తూ ''ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత బీజేపీ-ఈసీ జుగల్‌బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది. కనీసం విచారణ కూడా లేకుండానే ఒకరిని అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం'' అని అన్నారు.
దేశాన్ని మోడీ సర్వనాశనం చేశారు !
Thursday, June 11, 2026
Meenakshi Natarajan submitted every required document Modi has ruined the country national Rahul Gandhi there were no pending cases against her
No comments:
Post a Comment