చైనాలోని షింజియాగ్‌లోని ఉర్మికి బొటానికల్ గార్డెన్‌లో బాలుడిపై రోబో దాడి చేసింది. బాలుడి పొట్టలో తన్నడంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రోబోలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బొటానికల్ గార్డెన్‌కు వెళ్లాడు. అక్కడ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనను చూడటానికి మిగతా ప్రేక్షకులతో కలిసి నిలబడటంతో అంతా బాగానే సాగుతోంది. కానీ అంతలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఆ రోబో హఠాత్తుగా ఆ చిన్న బాలుడి పొట్టలో తన్నింది. ఈ వీడియో ఈ క్షణాల్లో వైరల్ కావడంతో.. రోబోల చుట్టూ ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియో క్లిప్‌లో కనిపించినట్లుగా.. ఆఫ్రో-స్టైల్ విగ్ ధరించిన ఆ హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తోంది. పిల్లలు, పెద్దలు ఆ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా చూస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ రోబో ఫైటింగ్ స్టాన్స్‌లో ముందుకు అడుగు వేసి చుట్టూ తిరుగుతూ రౌండ్‌హౌస్ కిక్ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాకపోయినప్పటికీ.. ఆ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా చూస్తున్న పింక్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ బాలుడి పొట్టకు నేరుగా తగిలింది.
0 Comments