Ad Code

రాయదుర్గం భూముల వేలంపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు !

హైదరాబాద్ లోని రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని భూమికి టీజీఐఐసీ ఇటీవల వేలం నిర్వహించింది. ఈ స్థలాన్ని ఎకరాకు రూ.237కోట్ల చొప్పున గౌర వెంచర్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆ భూమిలో 5 ఎకరాలు తమదేనంటూ హైకోర్టును ఎస్బీఐ బ్యాంక్ ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. సర్వే నంబర్ 83/1లోని 5 ఎకరాల భూమి తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాయదుర్గం భూముల వేలంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu