Ad Code

బోట్ రైడింగ్‌ను ఆస్వాదిస్తున్న క్షణంలో ఐఫోన్‌ను లాక్కుని సరస్సులోకి విసిరేసిన చిన్నారి : ఖంగుతిన్న తల్లి

ఒక చిన్నారి చేసిన అల్లరి పనికి, ఆ తల్లి ముఖంలో మారిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ తన చిన్న బిడ్డతో కలిసి సరస్సులో హ్యాపీగా బోట్ రైడింగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించింది. చుట్టూ అందమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఆమె ఎంతో మురిసిపోయింది. ఆ మధుర క్షణాలను రికార్డ్ చేయడానికి తన చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్‌తో వీడియోలు తీసుకుంటూ మునిగిపోయింది. ఆమె ఒళ్లో కూర్చున్న కొడుకు ఒక్కసారిగా తల్లి చేతిలో ఉన్న ఐఫోన్‌ను లాక్కుని సరస్సులోకి విసిరేశాడు. ఈ వీడియోలో అందరినీ విపరీతంగా నవ్విస్తున్న అంశం ఏమిటంటే.. ఫోన్ నీటిలో పడకముందు, పడిన తర్వాత ఆ తల్లి ముఖంలో వచ్చిన మార్పులే. అంతవరకు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్న ఆమె ముఖం.. ఫోన్ నీళ్లలో పడగానే ఒక్కసారిగా షాక్‌కు గురైంది. నిరాశ, నిస్సహాయతతో ఆమె పెట్టిన ముఖం చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంకోవైపు, తాను ఎంత పెద్ద పని చేశానో కూడా తెలియని ఆ చిన్నారి.. ఏమీ ఎరుగనట్టు ప్రశాంతంగా కూర్చోవడం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది.  ప్రస్తుతం ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పిల్లాడికి పాపం ఐఫోన్ విలువ తెలియదుగా అని ఒకరంటే.. అది ఆ పిల్లాడు సరస్సుకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu