Ad Code

వైరల్ అవ్వాలనే పిచ్చితో ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువకులు : నడుస్తున్న రైలులో తలకిందులుగా వేలాడిన యువకుడు

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చితో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ కనిపించే వీడియోలు ఈ మధ్య కాలంలో నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే, తాజాగా సోషల్ మీడియాలో ఒక కొత్త వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక యువకుడు వేగంగా నడుస్తున్న రైలు తలుపు పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ కనిపించాడు. నెటిజన్లు దీనిని అత్యంత బాధ్యతారహితమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. వైరల్ అవుతున్న దాదాపు 11 సెకన్ల ఈ వీడియోలో ఆ యువకుడు రైలు తలుపు వెలుపల తలకిందులుగా వేలాడుతుండటం చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను చాలా సెకన్ల పాటు అదే స్థితిలో ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భయం గానీ, ఆందోళన గానీ కనిపించలేదు. కొద్దిగా పట్టు తప్పినా లేదా చెయ్యి జారినా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కానీ, వాటిని వేటినీ ఖాతరు చేయకుండా ఆ యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కనిపించాడు. కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రజలు తమ ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని వీడియో చూసిన పలువురు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu