Ad Code

దేశ చరిత్రలోనే అతిపెద్ద 'షేర్ స్వాప్' : రూపాయి ఖర్చు లేకుండా ఆఫ్రికా బిజినెస్‌లో 79% వాటా సొంతం చేసుకున్న ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ 'ఎయిర్‌టెల్ ఆఫ్రికా'లో వాటాను భారీగా పెంచుకునేందుకు దాదాపు 100 శాతం షేర్‌హోల్డర్స్ నుండి క్లీన్ అప్రూవల్ సాధించింది. సుమారు రూ.28వేల 220 కోట్ల విలువైన ఈ మెగా డీల్‌కు ఇన్వెస్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎయిర్‌టెల్ ఈ డీల్ కోసం తన జేబులోంచి ఒక్క రూపాయి కూడా క్యాష్ తీయడం లేదు. ప్రమోటర్ గ్రూప్ సంస్థ అయిన 'ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్'కు భారతీ ఎయిర్‌టెల్ తన ఈక్విటీ షేర్లను ఇస్తుంది. దానికి బదులుగా ఆ సంస్థకు ఎయిర్‌టెల్ ఆఫ్రికాలో ఉన్న 16.31% వాటాను ఎయిర్‌టెల్ తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ క్యాష్‌లెస్ షేర్-స్వాప్ పద్ధతి వల్ల కంపెనీపై ఎలాంటి అదనపు అప్పుల భారం పడదు, అలాగే చేతిలో ఉన్న నగదు కూడా ఖర్చు కాదు. ఈ మెగా లావాదేవీకి సంబంధించి అన్ని రెగ్యులేటరీ అనుమతులు పూర్తి కాగానే ఎయిర్‌టెల్ ఆఫ్రికాలో భారతీ ఎయిర్‌టెల్ ఎఫెక్టివ్ వాటా ప్రస్తుతమున్న 62.73% నుంచి ఏకంగా 79 శాతానికి పెరుగుతుంది. ఆఫ్రికా బిజినెస్ అనేది గ్రూప్ మొత్తం ఆదాయంలో భారీగా లాభాలను తెచ్చిపెడుతున్న హై-గ్రోత్ అసెట్. అందుకే అక్కడ హోల్డింగ్ పెంచుకోవడం ద్వారా కంపెనీ తన భవిష్యత్ లాభాలను మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ బిగ్ డీల్ సక్సెస్ అవ్వడంపై భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ.. తమ గ్రోత్ వ్యూహంలో ఆఫ్రికా మార్కెట్ చాలా కీలకమైందని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద 'షేర్ స్వాప్'గా నిలిచిన ఈ డీల్ ద్వారా తమ ప్రధాన వ్యాపార అవసరాలకు కావలసిన క్యాపెక్స్ ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోగలిగాం. భవిష్యత్తులో ఆఫ్రికాలో ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక విలువను సృష్టించడానికి మరిన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ తన షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను మరింత పారదర్శకంగా మార్చేసి, మార్కెట్లో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గట్టిగా గెలుచుకుంది.

Post a Comment

0 Comments

Close Menu