77 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా సజావుగా సాగుతుందనే సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చాయి. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడడం భారత మార్కెట్లకు కలిసొచ్చాయి. గత సెషన్‌లో 76,808 వద్ద ముగిసిన సెన్సెక్స్ బుధవారం ప్రారంభం నుంచే లాభాల్లో కదిలింది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో సాగిన సూచీ చివరకు 347 పాయింట్లు ఎగబాకి 77,155 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా సానుకూల ధోరణిని కొనసాగించింది. 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. వ్యక్తిగత షేర్లలో ట్రెంట్, భారత్ డైనమిక్స్, జీఈ వెర్నోవా టీ అండ్ డీ, యెస్ బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు టీఎమ్‌పీవీ, బీఎస్‌ఈ లిమిటెడ్, కోల్గేట్, లోధా డెవలపర్స్, సమ్మన్ క్యాపిటల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో బ్యాంక్ నిఫ్టీ 187 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 321 పాయింట్లు పెరిగింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం