వెట్టిచాకిరీ నిరోధానికి సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు విధించాలని అమెరికా సిద్దమవుతున్నారు. భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్‌లతో సహా 60 దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 12.5 శాతం వరకు అదనపు పన్నులు విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు వెట్టిచాకిరీతో తయారైన వస్తువులపై నిషేధాన్నివిధించడంలో లేదా వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫల మయ్యాయని నిర్ధారించింది. ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ జాబితాలో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ మరియు స్విట్జర్లాండ్ తదితర దేశాలున్నాయి. ఇందులో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే లపై 10 శాతం సుంకాలు, ఇతర దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకం విధించనుంది. దీని ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలని యూఎస్‌టిఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. అవి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటనుంది. అలాగే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి. కానీ, ఒకవేళ ఇవి అమలులోకి వస్తే, సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ చర్య వీలు కల్పిస్తుంది. బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతిని పరిష్కరించడంలో ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు విఫలమవడం ఆమోదయోగ్యం కాదని USTR జామీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అమెరికన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీ పడవలసి వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విఫల విధానాల వల్ల కంపెనీలు తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తూ, మార్కెట్ పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. ,
0 Comments