Ad Code

టాటా మల్టీ సెక్టార్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ను లాంచ్ : కనీస పెట్టుబడి రూ.5 వేలు

టాటా మ్యూచువల్ ఫండ్ టాటా మల్టీ సెక్టార్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ను లాంచ్ చేసింది. దీని సబ్‌స్క్రిప్షన్ జూన్ 22, 2026న ప్రారంభమైంది. జులై 6, 206 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.1000 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీస సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టుబడి రూ.100 మాత్రమే. ఈ ఫండ్ మేనేజర్‌గా రాహుల్ సింగ్ ఉంటారని ఏఎంసీ తెలిపింది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 500 టీఆర్ఐగా ఉంది. ఇందులో హైరిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఈ ఫండ్‌లో అలాట్మెంట్ తర్వాత 30 రోజుల్లోపు విత్ డ్రా చేస్తే ఎగ్జిట్ లోడ్ 0.50 శాతంగా ఉంటుంది. ఆ తర్వాత విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ సమయంలో న్యూ ఫండ్ ఆఫర్‌ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా బ్రోకర్ లేదా మ్యూచువల్ ఫండ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ డైరెక్ట్, చాయిస్ ఇండియా వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే ఫండ్ గురించిన పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu