హైదరాబాద్ లోని గాంధీనగర్ ఎస్సై నరసింహులు మంగళవారం సాయంత్రం బాధితుడు నుంచి రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. ఒక కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి భవిష్యత్‌లో తనపై ఎలాంటి వేధింపులకు గురి చేయవద్దని కోరుతూ ఓ వ్యక్తి ఎస్సైను సంప్రదించగా రూ. లక్ష డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి హైదరాబాద్ సిటీ రేంజ్ 1 ఏసీబీని ఆశ్రయించడంతో మంగళవారం సాయంత్రం మొదటి విడుతగా రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
0 Comments