Ad Code

జూన్ 22, 23 తేదీలలో చైనా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జూన్ 22 నుంచి 23 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న 16వ బ్రిక్స్  జాతీయ భద్రతా సలహాదారుల, ఉన్నత ప్రతినిధుల సమావేశానికి వాంగ్ యీ హాజరవుతారు. వాంగ్ యీ గతేడాది కూడా న్యూఢిల్లీని సందర్శించి, 24వ ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భాగంగా అజిత్ దోవల్‌తో చర్చలు జరిపారు. ఆ సమావేశంలో, భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలు కొనసాగుతున్నాయని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకమని ఇరువురు పునరుద్ఘాటించారు.

Post a Comment

0 Comments

Close Menu