ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌

ప్రపంచ మేధోసంపత్తి సంస్థ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ 2025 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ చోటు దక్కించుకుని  గ్లోబల్ టాప్-20లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. 2025లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. జియో పేటెంట్ పోర్ట్‌ఫోలియో ప్రధానంగా 5G, 6G, కృత్రిమ మేధస్సు, క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్ డిజిటల్ సాంకేతికతలపై కేంద్రీకృతమైంది. సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌కు మంజూరయ్యాయి. మార్చి 31, 2026 నాటికి భారత్‌లో 538, విదేశాల్లో 471 పేటెంట్లు జియోకు లభించాయి.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org