ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12న ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఈసారి కొత్తగా ఇచ్చే పెన్షన్లలో వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ కూడా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలనే వారు ప్రధానంగా ఐదు రకాల పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధృవపత్రం, కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. వితంతు పెన్షన్లకు పైన తెలిపిన ఐదు పత్రాలతో పాటు భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి. అలాగే ఒంటరి మహిళల పెన్షన్ కావాలంటే ఐదు ప్రధాన పత్రాలతో పాటు ప్రభుత్వం లేదా కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికెట్ ఉండాలి. వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఐదు పత్రాలతో పాటు వయస్సు 60 ఏళ్లకు పైబడి ఉండాలి. వికలాంగుల పెన్షన్ కోసం ఐదు పత్రాలతో పాటు వైద్యులు ఇచ్చే సదరం సర్టిఫికెట్ కూడా సమర్పించాలి. ఈ పత్రాలతో ఈ నెల 12న సచివాలయాలకు వెళ్తే అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం క్షేత్రస్దాయిలో పరిశీలన చేసి పెన్షన్లను ఖరారు చేస్తారు.
0 Comments