దేశీయ మార్కెట్లో జూన్ 11న పోవా 8 విడుదల కానున్నట్లు టెక్నో అధికారికంగా ప్రకటించింది. భారీ 8,000mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ టీజర్ ద్వారా స్పష్టం చేసింది. టెక్నో విడుదల చేసిన ప్రచార చిత్రాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh భారీ బ్యాటరీ అందించనున్నారు. దీని వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వినియోగాన్ని కోరుకునే గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు ఇది మంచి ఎంపికగా నిలవవచ్చు. పోవా 8 ఆకుపచ్చ, వెండి రంగులలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పోవా 7లో కనిపించిన కెమెరా లేఅవుట్‌ను కొనసాగించినప్పటికీ, కొత్త మోడల్‌లో కెమెరా మాడ్యూల్ లోపల మ్యాట్రిక్స్-స్టైల్ LED లైటింగ్ సిస్టమ్ ను జోడించారు. ఇది నోటిఫికేషన్లు, కాల్స్, ఇతర ముఖ్యమైన అలర్ట్‌లను స్క్రీన్ ఆన్ చేయకుండానే చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గీక్‌బెంచ్‌లో కనిపించిన వివరాల ప్రకారం, టెక్నో పోవా 8లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను 6GB ర్యామ్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పరీక్షించినట్లు సమాచారం. ఎఫ్ సీసీ సర్టిఫికేషన్ వివరాల ప్రకారం, ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC (కొన్ని మార్కెట్లలో మాత్రమే), వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
0 Comments