తెలంగాణలోని శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
0 Comments