తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. ఈ రోజు గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ అయ్యారు. తనకు ఉన్న సంఖ్యా బలం గురించి వివరించారు. తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కావాలని గవర్నర్ విజయ్ కు సూచించారు. 20 మంది మంత్రులతో విజయ్ సీఎంగా ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది.
0 Comments