పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ ను అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడిని మూడు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా, ఈనెల 16న బండి భగీరథ్‌ను అరెస్టు చేసి, పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అతడిని కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్‌ విచారించారు. మరోవైపు, భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఇటీవలే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని భగీరథ్‌ కోరారు. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై రిలీజ్‌ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది.