ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో నాలుగంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు మొదలయ్యాయి. వేడి ధాటికి మంటలు వేగంగా భవనంలోని రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ, పొగ, మంటలు చుట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిలకు సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెస్క్యూ టీమ్ సాహసోపేతంగా వ్యవహరించి భవనంలో చిక్కుకుపోయిన 15 మందిని సురక్షితంగా వెలికితీసింది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ, మంటల్లో చిక్కుకుని నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
0 Comments