తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఒక కొలిక్కి రాకుండా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మెజారిటీ సాధించినా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జాప్యం చేస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆ పార్టీ అధినేత విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడంతో విజయ్ ఇప్పుడు న్యాయపోరాటం వైపు అడుగులు వేస్తున్నారు. గవర్నర్ తీరుపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్న విజయ్, ఈ మేరకు ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్టీని ఆహ్వానించకపోవడం సరికాదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. దీంతో అటు న్యాయపరంగా, ఇటు రాజకీయంగా తమిళనాడులో ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి.
0 Comments