Ad Code

నష్టాల్ని నమోదు చేసిన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు..  సెన్సెక్స్‌ 1064, నిఫ్టీ 322 పాయింట్లు చొప్పున నష్టం 

భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో మళ్లీ నష్టాల్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 32 పాయింట్లు తగ్గింది. ఐటీ స్టాక్స్ రాణించినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, డీమార్ట్, ఇండిగో, టాటా స్టీల్ సహా ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ నష్టపోయాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఎయిర్‌టెల్ షేరు 1.26 శాతం పడిపోగా, మార్కెట్ విలువ రూ. 11.66 లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 0.75 శాతం తగ్గగా, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11.74 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఇదే మళ్లీ మార్కెట్ విలువ పరంగా భారత రెండో అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.89 లక్షల కోట్ల మార్కెట్ విలువతో భారత్‌లో అతిపెద్ద కంపెనీగా ఉంది. నాలుగో స్థానం నుంచి వరుసగా చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్, లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఐసీ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కొద్ది రోజుల కిందటే.. మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల్లో చోటు కోల్పోయింది.

Post a Comment

0 Comments

Close Menu