Ad Code

గుంతకల్ - వాడి లైన్ నిర్మాణానికి రూ. 4,758 కోట్లు కేటాయింపు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు రూ. 1,52,702 కోట్ల నిధులను మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్ రంగాలకు ఈ నిధులను కేటాయించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. చెరుకు రైతులకు తీపి కబురు అందించింది. 2026-27 సంవత్సరానికి గాను చెరుకు 'ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్' కోసం ఏకంగా రూ. 1 లక్ష కోట్లను కేటాయించింది. కాటన్ మిషన్, పత్తి ఉత్పాదకతను పెంచేందుకు 'మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ' కింద రూ. 5,659 కోట్లు మంజూరు చేసింది. టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్.. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం ఈ సంస్థకు రూ. 3,068 కోట్లు కేటాయించారు. సుచి సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్.. మరో యూనిట్ కోసం రూ. 868 కోట్లు మంజూరు చేశారు. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు మూడు కీలక మార్గాల్లో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నగద - మథుర రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 16,403 కోట్లు, గుంతకల్ - వాడి లైన్ నిర్మాణానికి రూ. 4,758 కోట్లు కేటాయించారు. బుర్హవాల్ - సీతాపూర్ రైల్వే లైన్‌కు రూ. 2,276 కోట్లు కేటాయించారు. వీటితోపాటు మరికొన్ని ఇతర కీలక నిర్ణయాలను కేంద్ర క్యాబినెట్ తీసుకుంది. ఎంఎస్ఎంఈలకు మద్దతునిచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కోసం రూ. 18,100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. షిప్పింగ్ రంగం.. వడినర్‌లో ఓడల మరమ్మత్తుల సౌకర్యాల అభివృద్ధికి రూ. 1,570 కోట్లు కేటాయించారు. సుప్రీంకోర్టు బలోపేతం.. అత్యున్నత న్యాయస్థానం పనితీరును మరింత మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఒక కీలక విధాన నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఈ భారీ కేటాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu