ఇండోనేషియాలో ట్రావెల్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 16 మంది సజీవదహనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం సుమత్రా ఐలాండ్ లో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే లుబుక్లింగ్గౌ నగరం నుంచి జాంబీకి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదాన్ని నివారించే క్రమంలో బస్సును కుడి వైపునకు మళ్లించారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ ట్రక్ బస్సును ఢీకొంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు.
0 Comments