బీఎస్‌ఎన్‌ఎల్ గతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రాచుర్యం పొందిన 'ఆజాదీ కా ప్లాన్'ను ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. సామాన్యులకు ఊరటనిచ్చేలా కేవలం రూ. 1 కే నెల రోజుల పాటు సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు అద్భుతం అనే చెప్పాలి. కేవలం ఒక రూపాయి ఖర్చుతో వినియోగదారులు ఎన్నో సేవలను పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్.. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా 30 రోజుల పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. డేటా సౌకర్యం.. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెలకు మొత్తం 60జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఎస్సెమ్మెస్‌లు.. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. వాలిడిటీ.. ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజుల వరకు ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి సిమ్ కార్డు కూడా ఉచితంగా అందజేస్తారు. ఇది కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే పరిమితం. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి మారాలనుకునే వారికి లేదా కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ ప్లాన్ కేవలం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
0 Comments