Ad Code

వేగంగా వెళ్తున్న బస్సులోంచి కింద పడి వృద్ధురాలు మృతి : వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌


మిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కోవైపుదూరు సమీపంలోని అరివోలి నగర్‌కు చెందిన 66 ఏళ్ల కామాక్షి ఆదివారం ఉదయం అయ్యప్పాల్ కోవిల్ బస్టాప్ వద్ద ఎస్‌-17 నంబర్ బస్సు ఎక్కింది. కాగా, బస్సు వెనుక ద్వారం నుంచి ఎక్కిన ఆ వృద్ధురాలు ముందు ఉన్న ఖాళీ సీటు వద్దకు నడిచి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో బస్సు డ్రైవర్‌ వేగాన్ని పెంచాడు. అదుపు తప్పిన కామాక్షి డోర్‌ లేని బస్సు ముందు ద్వారం నుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయమైన ఆ వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు ఆధారంగా బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu