Ad Code

నడిరోడ్డుపై మహిళపై సామూహిక అత్యాచారయత్నం : సోషల్ మీడియాలో వీడియో వైరల్


బీహార్ లోని నలంద జిల్లాలో ఓ మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారయత్నం చేశారు. స్థానికంగా వున్న మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా బాధిత మహిళను అడ్డుకుని, ఆపై బలవంతం చేయబోయారు. ఈ క్రమంలో ఆ యువతి బట్టలు చించేశారు. నడిరోడ్డుపైన ఆమె అసభ్యంగా తాకుతూ దారుణంగా హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ప్రాంత జనాలను తిట్టిపోస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజలు సినిమాలా చూస్తుండిపోవడం సరికాదంటున్నారు. ఇది సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిందని వాపోతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu