Ad Code

మే 7న వన్ ప్లస్ నార్డ్ CE 6 మరియు నార్డ్ CE 6 లైట్ లాంచ్ !


దేశీయ మార్కెట్లో మే 7న  వన్ ప్లస్ నార్డ్ CE 6 మరియు నార్డ్ CE 6 లైట్ లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. వన్ ప్లస్ ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేస్తోంది. వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ఈ రెండు ఫోన్లు కూడా అమెజాన్ ఇండియా మరియు వన్ ప్లస్ అఫీషియల్ సైట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తాయి. వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ మాదిరిగా వన్ ప్లస్ నార్డ్ 6 CE లో కూడా టచ్ రిఫ్లెక్స్ చిప్ ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ కలిగిన ఈ డ్యూయల్ చిప్ పవర్ తో 144Hz రిఫ్రెష్ రేట్ తో గేమింగ్ సపోర్ట్ చేస్తుందని వన్ ప్లస్ తెలిపింది. గేమింగ్ కి తగిన డిస్ప్లే కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 3840Hz PMW డిమ్మింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా స్లిమ్ అండ్ కాంపాక్ట్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ 10 గంటల నాన్ స్టాప్ BGMI ప్లే లేదా 30 గంటల యూట్యూబ్ ప్లే అందించే భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ బ్యాటరీతో పాటు 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా వన్ ప్లస్ ఈ ఫోన్ లో అందించినట్లు తెలిపింది. వన్ ప్లస్ నార్డ్ 6 CE స్మార్ట్ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K హై టైట్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను 1 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7400 APEX చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ కలిగిన పవర్ ఫుల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu