బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ధరలో 72 రోజుల వ్యాలిడిటీ తో అందించిన రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు రూ. 6.73 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. డైలీ 2 జీబీ వేగవంతమైన 4G డేటా, ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అలాగే, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది. దీనితో పాటు మరో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా యూజర్లకు అతి తక్కువ ధరలో 5 నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అదే, బీఎస్ఎన్ఎల్ రూ. 997 బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది రూ. 997 రూపాయల రీఛార్జి తో వస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ప్రతిరోజూ 2 జీబీ వేగవంతమైన డేటా కూడా అందిస్తుంది. అదనంగా, ఈ లిమిట్ క్లోజ్ అయిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం లభిస్తుంది.
0 Comments