ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణం, కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం పేలుడు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఆ సమీపంలో ఉండే ఐదు ఇల్లు నేలమట్టమయ్యాయని తెలుపుతున్నారు. ఆ ఇళ్ల శిధిలాల కింద కూడా మరి కొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిందా లేకపోతే జిలేటిన్ స్టిక్స్ పేలిందా అనే విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఆ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక అధికారులు సైతం ఈ పేలుడుకు గల కారణాల విషయం పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం చికిత్స అందిస్తున్నారు. సుమారుగా 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఇందులో 12 మంది పరిస్థితి విషయంగానే ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనను మృతి చెందిన వారిలో మహబూబున్నీ(40), సంపత్ (30), వెంకన్న (45), మధు (36) గా గుర్తించారు. ఈ పేలుడు పైన సమాచారం అందుకున్న జిల్లా అధికారులు కూడా అక్కడ పరిస్థితిని సమిక్షిస్తున్నారు. మరి ఈ పేలుడుకు గల కారణాలను పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం మృతుల సంఖ్య గంటకు పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు తెలియజేస్తున్నారు.
0 Comments