బీఎస్ఎన్ఎల్ యూజర్లకు నెల రోజుల ప్లాన్ మొదలుకొని పూర్తిగా సంవత్సరం వాలిడిటీ అందించే ప్లాన్స్ వరకు మంచి బడ్జెట్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. వీటిలో రూ. 225 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 997 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రెండూ కూడా తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 2.5 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో నెలంతా అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇదే కాదు నెల మొత్తం డైలీ 100SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది బడ్జెట్ ధరలో నెల రోజులు అన్లిమిటెడ్ లాభాలు కోరుకునే యూజర్లకు చక్కగా సరిపోతుంది. రూ. 997 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా ఐదు నెలల అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ యూజర్లకు 150 వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా, లిమిట్ ముగిసిన 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 150 రోజులు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు ఐదు నెలల పాటు అన్లిమిటెడ్ లాభాలు లభిస్తాయి.
0 Comments