తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ నిల్వలు, దారి మళ్లింపులపై అధికారులు నిఘా పెంచారు. గత నెల రోజులుగా నిర్వహించిన దాడుల్లో రూ. 1.5 కోట్ల విలువైన 5,079 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి, 2,089 కేసులు నమోదు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏజెన్సీల బుకింగ్‌లు, డెలివరీలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగినా లేదా ఎక్కడైనా అక్రమ రవాణా గమనించినా ప్రజలు 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
0 Comments