బీహార్‌లోని కతీహార్ జిల్లాలో జాతీయ రహదారి-31పై గెరాబారి గ్రామం వద్ద ఒక ప్రైవేట్ బస్సు, వ్యాన్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో 13 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, చికిత్స పొందుతూ మరో ఐదుగురు కన్నుమూశారు. ఈ ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులంతా జార్ఖండ్ నుండి పూర్ణియాకు తిరిగి వస్తున్న గిరిజన తెగకు చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
0 Comments