Ad Code

మూజువాణి ఓటుతో స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం


లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో బుధవారంనాడు వీగిపోయింది. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు. రాహుల్ గాంధీ, అమిత్‌షా, రవిశంకర్ ప్రసాద్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం ఓటింగ్ చేపట్టగా మూజువాణి ఓటుతో ప్రతిపక్షాల తీర్మానం వీగిపోయింది. 

Post a Comment

0 Comments

Close Menu