పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్ చేయడం ఇది రెండో సారి. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో కీలక మౌలిక వసతులపై జరిగిన దాడులను ఖండించారు. అవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, ప్రపంచ సరఫరా గొలుసులకు ఆటంకాలు కలగజేస్తాయని అన్నారు. ఈద్ పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
0 Comments