తెలంగాణ హైకోర్టు పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఈ రోజు విచారణ జరిగింది. దాంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన జాబితాలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు ఉన్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
0 Comments