రాజస్తాన్ లోని జైపూర్ - అజ్మీర్ నేషనల్ హైవే-48పై ఓ సిలిండర్లను తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. కొందరు సిలిండర్లను పట్టుకెళ్లారు. కొందరైతే పేలుతాయనే భయంతో దూరంగా వుండిపోయారు. స్థానికులు సిలిండర్లు రోడ్డుపై పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను చెల్లాచెదురుగా పడిన వాటిని సేకరించడంలో స్థానికులు సహాయం చేశారు. ఆపై సిలిండర్లు లీక్ అవుతున్నాయా లేవా అని చెక్ చేశారు. అవి సురక్షితంగా వున్నాయని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
0 Comments