ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ పతనాన్ని చూశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే 1 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. యుద్ధ భయాల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,097 పాయింట్లు (1.37%) కోల్పోయి 78,918.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 315.45 పాయింట్లు (1.27%) పడిపోయి 24,450.45 వద్ద స్థిరపడింది. మార్కెట్ క్యాప్ బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 453 లక్షల కోట్ల నుంచి 452 లక్షల కోట్లకు పడిపోయింది. మార్కెట్ పతనానికి ప్రధానంగా బ్యాంకింగ్ రంగం కారణమైంది. అయితే యుద్ధ వాతావరణం కారణంగా రక్షణ రంగ షేర్లు పుంజుకున్నాయి. నిఫ్టీ బ్యాంక్ అత్యధికంగా 2.15% పడిపోయింది. రియల్టీ (2.09%), పిఎస్‌యు బ్యాంక్ (2.01%), ఆటో (1.06%), కన్జమ్ప్షన్ (1.02%) రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ 2.77% లాభపడింది. ఎనర్జీ (0.13%), ఐటీ (0.04%) రంగాలు స్వల్పంగా పుంజుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయం మార్కెట్‌లో నెలకొంది. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్లు, డబ్ల్యూటిఐ క్రూడ్ 80 డాలర్లు దాటడం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా షేర్లను విక్రయిస్తున్నారు. గురువారం ఒక్కరోజే వీరు 3,752.52 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు.
యుద్ధ భయాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు : లక్షల కోట్లు ఆవిరి
Friday, March 6, 2026
business investors turned to selling due to war fears Lakh crores evaporated nationl Stock markets crashed due to war fears
No comments:
Post a Comment