Ad Code

శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ ఎఫ్ఐఆర్ నమోదు


కాశ్మీర్ లోయలో ఖొమైనీ మృతికి సంతాపం ప్రకటిస్తూ షియా  ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే పలువురు ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసారు. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలతో కేసు పెట్టారు. ఎంపీతో పాటు శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టూపై కూడా కేసులు నమోదు అయ్యాయి. లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టూ తప్పుడు వీడియోలను పోస్ట్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu