Ad Code

రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల డిమాండ్‌


తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గళమెత్తారు. వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానందా, కల్వకుంట సంజయ్‌  సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ నెలకు రూ. 700 కోట్ల బకాయిలను చెల్లిస్తామని చెప్పి , ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. ఎంతోమంది ఉద్యోగులు వారి మనోవేదనను చెప్పుకోలేక, ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారురని, 5 డీఏలు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే సంజయ్‌ ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని కోరారు.

Post a Comment

0 Comments

Close Menu