Ad Code

భక్తులను విచక్షణారహితంగా కొట్టిన పూజారులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్‌


హారాష్ట్ర కొల్హాపూర్‌లోని జ్యోతిబా ఆలయంలో సుమారు 15 నుంచి 20 మంది పూజారులు కొందరు భక్తులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితులను పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడమే కాకుండా కొబ్బరికాయలతోనూ పూజారులు దాడి చేయడం ఈ వీడియోలో కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ప్రధాన హారతి సమయంలో కొందరు యువకులు ఆలయంలో గందరగోళం సృష్టించారు. పూజారులపై గులాల్ (రంగు) చల్లి, వారి టోపీలను కింద పడేశారు. వారిని వారించే క్రమంలో సహనం కోల్పోయిన పూజారులు ఆ యువకులను గుడి బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. కొందరు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. ఈ ఘటనపై ఆలయ కమిటీ స్పందిస్తూ పూజారులకు మద్దతుగా నిలిచింది. పక్క ఊరి నుంచి మద్యం మత్తులో వచ్చిన సుమారు 100-200 మంది ఆకతాయిలు.. హారతిని అడ్డుకోవడమే కాకుండా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, వృద్ధ పూజారులను సైతం అవమానించారని ఆరోపించింది. పూజారులను అప్రతిష్టపాలు చేసేందుకే వీడియోను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu