రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా భీమ్‌గుడా గ్రామానికి చెందిన సోహన్‌లాల్‌కు దూంగ్రి గ్రామానికి చెందిన సరితతో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాదిగా ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సరిత తన భర్తను వీడి పుట్టింట్లో నివసిస్తున్నది. వైవాహిక వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, మార్చి 7న మధ్యాహ్నం వేళ అత్తవారింటికి సోహన్‌లాల్ చేరుకున్నాడు. అక్కడ వారితో గొడవపడ్డాడు. తన భార్యను విడదీసేందుకు అత్త ఉసుగొల్పుతున్నదని ఆరోపించాడు. గొడవ పెరుగడంతో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో అల్లుడిపై ఫిర్యాదు చేసేందుకు అత్త అయిన 52 ఏళ్ల కైలీ దేవి, సర్వానా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది. అప్పుడు అల్లుడు సోహన్‌లాల్ అత్తను అడ్డుకున్నాడు. కత్తెరతో ఆమె ముక్కు కోశాడు. తెగిన ముక్కు భాగాన్ని చేతపట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన కైలీ దేవిని తొలుత సర్వానాలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గుజరాత్‌లోని మెహ్సానా ఆసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. అయితే మామ బాబులాల్ కిచాడ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సోహన్‌లాల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
0 Comments