Ad Code

టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన


రాన్‌ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని ప్రొటెస్ట్‌ స్క్వేర్‌ సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. పాలస్తీనా పోరాటానికి మద్దతుగా, రంజాన్ మాసపు చివరి శుక్రవారమైన 'కుద్స్ దినోత్సవం' సందర్భంగా టెహ్రాన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ప్రజలు భారీగా గుమిగూడారు. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై నిరసన తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని ప్రొటెస్ట్‌ స్క్వేర్‌ సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రభుత్వ అనుకూల ప్రదర్శన జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే బాంబు దాడులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ దాడులు జరిగినప్పటికీ ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సహా సీనియర్ అధికారులు సామూహిక ర్యాలీకి హాజరయ్యారు. ఇరాన్‌ ప్రజలతో సెల్ఫీలు దిగారు. మరోవైపు నిరసన ర్యాలీ వద్ద దాడుల నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్‌ను ఇరాన్‌ హెచ్చరించింది. శత్రువులకు మరిచిపోలేని గుపాఠం నేర్పుతామని పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను ఇరాన్‌ కొనసాగించింది. ఇరాన్‌ ప్రతిదాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంలోని ఒక భవనం ధ్వంసమైంది. అయితే వచ్చే వారం ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ఇంటర్వూలో హెచ్చరించాడు.

Post a Comment

0 Comments

Close Menu