Ad Code

నిలకడగా ఉన్న సోనియాగాంధీ ఆరోగ్యం


కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఢిల్లీ ఆస్పత్రి గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ అజయ్ స్వరూప్‌ తెలిపారు. ఆమెకు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని, చికిత్సకు వేగంగా స్పందిస్తున్నారని అన్నారు. సీనియర్‌ వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తోందని, మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వుందని చెప్పారు. వాతావరణ మార్పులతో పొట్ట, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో మంగళవారం రాత్రి ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu