Ad Code

జల్లికట్టులో అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన ఎద్దులు : ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు


మిళనాడు లోని శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోటీల సందర్భంగా అదుపు తప్పిన ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, 76 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu