చైనాలో మార్చి 30న జరగబోయే ఈవెంట్‌లో వివో ఎక్స్ 300 అల్ట్రా, వివో ఎక్స్ 300ఎస్ మోడల్స్ ను విడుదల చేయనున్నట్లు వివో ప్రకటించింది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా, అదే వేదికపై వివో ప్యాడ్ 6 ప్రో టాబ్లెట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 3 నుంచి ఇవి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా 'అల్ట్రా' నిలవనుంది. దీని డిజైన్, కెమెరా ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్, ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్, పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌తో ఇది చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ఎప్పటిలాగే Zeiss బ్రాండింగ్‌తో వస్తున్న ఈ కెమెరా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభూతిని ఇస్తుంది. ఇందులో బ్లూ ఫ్రింట్ ఒరిజినల్ కలర్ కెమెరా టెక్నాలజీని వాడుతున్నారు. 12 స్పెక్ట్రల్ ఛానల్స్ సాయంతో ఫోటోల్లో రంగులు అత్యంత సహజంగా, ఖచ్చితత్వంతో కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ చరిత్రలో ఇదొక రికార్డు అని చెబుతున్నారు. స్పీడ్ తోపాటు పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం వివో ఎక్స్ 300 ఎస్ సిద్ధమవుతోంది. గీక్‌బెంచ్ లీక్స్ ప్రకారం పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. దీని ప్రైమ్ కోర్ వేగం 4.21GHz వరకు ఉంటుంది. 16జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది.
0 Comments