Ad Code

ప్రైవేట్‌ కాలేజీ బస్సును ఢీ కొట్టిన గూడ్సు రైలు : 15 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం


మిళనాడులోని కరూర్‌, వెల్లియానై సమీపంలో ఓ ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సు రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ దానిమీదే ఆగిపోయింది. అదే సమయంలో ప్రైవేట్ సిమెంట్ కర్మాగారం కోసం గ్రావెల్‌ స్టోన్స్‌ తీసుకెళ్తున్న గూడ్సు రైలు దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో కళాశాల బస్సులోని 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంపీ జ్యోతిమణి స్వయంగా కలిసి, వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu