నేడు జరగాల్సిన పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి బోర్డు ప్రధాన కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలన్నింటికీ ఈ వాయిదా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నామని, సోమవారం నాడు పరీక్షల నిర్వహణ సాధ్యం కానందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బోర్డు పేర్కొంది. వాయిదా పడిన సబ్జెక్టులకు సంబంధించిన తదుపరి పరీక్షా తేదీలను పరిస్థితులు కుదుటపడిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
0 Comments