అమెరికా ఆంక్షలతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులెదుర్కుంటున్న క్యూబాకు బ్రెజిల్ సంఘీవం తెలిపింది. బ్రెజిల్‌లో భూమిలేని గ్రామీణ కార్మికుల ఉద్యమం (ఎంఎస్‌టి), ఇతర ప్రముఖ సంస్థలు క్యూబాకు మందుల్ని పంపడానికి సంఘీభావ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్బంగా ఎంఎస్‌టి వ్యవస్థాపకుడు, జాతీయ నాయకుడు జీవోపెడ్రో స్టెడిల్ తాజాగా సోషల్‌మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో క్యూబాపై ఆరు దశాబ్దాలకుపైగా అమలులో ఉన్న అమెరికా దిగ్బంధన ప్రభావాలను ఆయన తీవ్రంగా ఖండించాడు. విదేశీ కరెన్సీ పొందడంలోనూ, అంతర్జాతీయ రవాణా విధాన సమస్యల కారణంగా క్యూబాకు మందుల కొరత ఏర్పడింది. క్యూబా మందులు పొందే సామర్థ్యం అమెరికా ఆంక్షలు చాలా పరిమితం చేశాయి. దీంతో క్యూబాలో అనారోగ్యపాలవుతన్న ప్రజల ఆరోగ్యం కోసం మందులను సరఫరా చేయడానికి బ్రెజిల్ పలు సంస్థలు ముందుకొచ్చాయి. క్యూబాకు విమానం ద్వారా సరుకుల్ని పంపడానికి డాలర్లలో ఖర్చవుతుంది. క్యూబాకు ఎయిర్ షిప్‌మెంట్‌లను నిర్వహించడానికి ప్రతి ఆర్డర్ కనీసం 39 వేల డాలర్లకు చేరుకోవాలి. కాబట్టి ఫస్ట్ షిప్‌మెంట్‌ను పూర్తి చేయడానికి ఏడాది పొడవునా ప్రచారాన్ని చురుకుగా ఉంచడానికి వెయ్యి మంది కార్యకర్తలు చేరాలని జీవోపెడ్రో స్టెడిల్ పిలుపునిచ్చారు. క్యూబాకు సంఘీభావంగా నిలుస్తామని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, బ్రెజిలియన్ అధికారులు, ప్రముఖ వ్యక్తులు సంతకం చేసిన సంయుక్త ప్రకటనను ఎంఎస్‌టి విడుదల చేసింది.
0 Comments