ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో అంటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం మధ్యాహ్నం కొత్తగా హై-మాస్ట్ బిల్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్డుపై ఒక కారు వెళ్తున్న సమయంలో కొత్తగా నిర్మిస్తున్నహై-మాస్ట్ బిల్‌బోర్డ్ పోల్ కూలిపోయింది. కారు డ్రైవ్ చేస్తున్న ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ కారులోనే మరణించారు. మరోవైపు పోలీసులు, స్థానిక అధికారులు అక్కడకు చేరుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
0 Comments