Ad Code

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల


జేఈఈ (మెయిన్‌)-2026 పేపర్‌-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం ఫైనల్ కీని ప్రకటించిన అధికారులు, కొద్దిసేపటి క్రితమే ఫలితాలను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ అప్రతిహత విజయయాత్రను కొనసాగించారు. దేశస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలుగు వారు గట్టి పోటీనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక విద్యార్థి 100 పర్సంటైల్ స్కోరుతో అద్భుత ప్రతిభ కనబరిచారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu